వేములవాడ గడ్డ రుణం తీర్చుకుంటా : ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ హామీ ఇచ్చారు.  ఆదివారం వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు, ఆర్యవైశ్య వాసవీ  సంఘం నిత్యాన్నదాన సత్రంలో  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ అండదండతో సంఘాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఆయనను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు బింగి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సోమినేని మహేశ్,  ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బుస్స శ్రీనివాస్​, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్​, కట్కం కిషన్​, నగుబోతు రవీందర్​,  దశరథం పాల్గొన్నారు.  

రుద్రంగిలో సంబురాలు 

చందుర్తి: ప్రభుత్వ విప్ గా నియామకమయ్యాక  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​తొలిసారి ఆదివారం సొంత గ్రామం రుద్రంగికి వచ్చారు. ప్రజలు డప్పు చప్పులు పూలదండలతో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రుద్రంగిలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్లు సేవకుడిగా పనిచేస్తాననన్నారు. కార్యక్రమంలో సర్పంచ్  తర్రె ప్రభలత, లీడర్లు పొద్దుపొడుపు లింగారెడ్డి, తిరుపతి, గంగ మల్లయ్య, గంగ నరసయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు