కృత్రిమ కరువు సృష్టించాలని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తున్నారు : ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు : రాష్ట్రంలో  కృత్రిమ కరువు సృష్టించేందుకు బావబామ్మర్దులు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం, తెట్టకుంట, చీర్లవంచ గ్రామాల్లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

ఇటీవల కేటీఆర్, హరీశ్​రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని మాట్లాడడం చూస్తే అసలు వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారా అని అనిపిస్తోందన్నారు. ఎన్నికలకు ముందే మేడిగడ్డ కుంగిపోవడంతో తమ లోపాలు బయటపడతాయని బ్యారేజీలోని 7 టీఎంసీల నీటిని వదిలిపెట్టారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని, తానే ఇంజనీర్ అని గొప్పలు చెప్పి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నీరందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అర్బన్​ మండల అధ్యక్షుడు పిల్లికనుకయ్య, జడ్పీటీసీ మ్యాకల రవి,  ప్రభాకర్ రెడ్డి​, ఎర్రం రాజు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.