- ఫస్ట్ మీ పార్టీ బీసీలకు వ్యతిరేకి
- కేటీఆర్‌పై ఫైర్
హైదరాబాద్: బీసీల విషయంలో కేటీఆర్ నీతులు చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బీసీ కుల గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మా ప్రభుత్వంపై డెడ్‌లైన్ పెట్టేంత సీన్ కేటీఆర్‌కు లేదు. ఇప్పటికే దీనిపై అసెంబ్లీలో తీర్మాణం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. అంతే చిత్తశుద్ది ఉంటే బీఆర్ఎస్ పదేళ్లు ఎందుకు చేయలేదు.
ఫస్ట్ మీ పార్టీ బీసీలకు వ్యతిరేకి.. బీఆర్ఎస్ ప్రెసిడెంట్, వర్కింగ్‌ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత పదవుల్లో ఒక్కరైనా బీసీ ఉన్నారా..? మూడు పదవులు అయ్యా.. కొడుకేనా.. చిత్తశుద్ది ఉంటే కేటీఆర్ ఫస్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి, బీసీ ఇచ్చి, మాట్లాడాలి. ఇప్పటికైనా కేటీఆర్సుద్దపూస మాటలు ఆపాలి. బీసీ జనాభా అధికంగా ఉందన్న ఆలోచనతోనే కేసీఆర్ సమగ్ర సర్వే రిపోర్ట్ బయటపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇస్తుంది.
కాంగ్రెస్ స్వయంగా బీసీకి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చింది. మా ప్రభుత్వం బీసీలకు చేస్తున్న పనులకు ఎవరూ శంకించాల్సిన అవసరం లేదు. పదేళ్ల విధ్వంసకర పాలనను గాడిలో పెడుతున్నాం. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ నలుగురే కనిపించేవారు, ఇప్పుడు వాళ్లే మీడియా ముందు కనిపిస్తున్నారు. చివరకు మిగిలేది ఆ నలుగురు మాత్రమే. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చాం. బీఆర్ఎస్ కేవలం వాళ్లను ఉద్యమంలో వాడుకున్నారని ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.