కేటీఆర్​.. అహంకారం తగ్గించుకో : ఆది శ్రీనివాస్

  • కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్ కార్యకర్త అనడానికి నీకు సిగ్గుండాలి: విప్​ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌
  • సిరిసిల్లలో గత పదేండ్ల భూ, ఇసుక దందాలను కలెక్టర్​బయటికి తీస్తుంటే బెదిరిస్తవా?
  • వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని కేటీఆర్​ తన అనుచరులకు కట్టబెట్టారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ మహా వృక్షం కాదని, ఆయనొక విష వృక్షం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారం సీఎల్పీలో జరిగిన మీడియా సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన మాట్లాడారు. సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేటీఆర్ చేసిన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సన్నాసి అంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని, ఆయనను కాంగ్రెస్ కార్యకర్త అనడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. సిరిసిల్లలో గత పదేండ్లుగా కేటీఆర్, ఆయన అనుచరులు చేసిన భూ, ఇసుక దందాలను కలెక్టర్ బయటకు తీస్తుండటంతోనే బెదిరింపులకు దిగుతున్నారన్నారు.

1,000 ఎకరాల ప్రభుత్వ భూములను కేటీఆర్ తన అనుచరులకు కట్టబెట్టారని, అనర్హుల చేతికి వెళ్లిన 150 ఎకరాలను కలెక్టర్ వెనక్కి తీసుకుంటున్నారని చెప్పారు. భూముల విషయంలో కలెక్టర్ కేటీఆర్ మాట వినడం లేదనే బెదిరింపులకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. సిరిసిల్ల భూముల వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి తాత దిగొచ్చినా ఏం చేయలేరని కేటీఆర్ మాట్లాడుతున్నారని, కేటీఆర్.. రేవంత్ రెడ్డే మీ అయ్య కుర్చీ పీకి ఫామ్ హౌస్‌‌‌‌‌‌‌‌లో పడుకోబెట్టిండని దుయ్యబట్టారు. 

ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ల సంఘం స్పందించండి..

కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలని ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ కోరారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దూషించిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం తరఫున కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర అధికారులను బహిరంగంగా బెదిరించిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణకు అనుమతించాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాస్తే ఇప్పటి వరకు సమాధానం లేదని, బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాబట్టే గవర్నర్ విచారణకు అనుమతిఇవ్వడం లేదని ఆరోపించారు. 

సిరిసిల్లలో అక్రమాలపై శాఖాపరమైన విచారణ జరిపించాలని సీఎస్‌‌‌‌‌‌‌‌ను కోరారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇజ్ఞత్‌‌‌‌‌‌‌‌ను కేటీఆర్ తీస్తుండని, ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ పలుచన చేస్తున్నారని విమర్శించారు. పదేండ్లు కలెక్టర్లుగా పని చేసిన వాళ్లు బీఆర్ఎస్ కార్యకర్తలేనా? కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మతి భ్రమించిందని మండిపడ్డారు.