మహాశివరాత్రి జాతరకు రండి : ఆది శ్రీనివాస్

  •     శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, అడ్లూరి, జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఆది శ్రీనివాస్​ ఆహ్వానం 

వేములవాడ, వెలుగు : వేములవాడ మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు హాజరుకావాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబుకు ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ బుధవారం ఆహ్వానపత్రిక అందజేశారు. ఆయనతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే,  విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు ఆహ్వాన పత్రికలను అందించారు. ఎంపీ  బండి సంజయ్ కి రాజన్న ఆలయ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హరిహరనాథ్​ ఆహ్వాన పత్రికను అందజేశారు. 

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిలర్​ 

వేములవాడ 25వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ గూడూరి లక్ష్మి- సుమారు 100 మందితో బుధవారం విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఆమెకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా కౌన్సిలర్ ​మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.