మున్నూరు కాపు సంఘం స్టేట్​ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్​గా ఆది శ్రీనివాస్

మున్నూరు కాపు సంఘం స్టేట్​ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్​గా ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: మున్నూరు కాపు సంఘం స్టేట్ అపెక్స్ కౌన్సిల్  చైర్మన్ గా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  నియమితులయ్యారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్థానంలో ఆది శ్రీనివాస్ ను ఎంపిక చేశారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవి చంద్ర ఆధ్వర్యంలో శనివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆది శ్రీనివాస్ ను నియమిస్తూ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నిర్ణయం తీసుకుంది.