చందుర్తి, వెలుగు: వేములవాడ నియోజకవర్గంలోని దేవాలయాలకు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో బుధవారం పెద్దమ్మ గుడికి భూమిపూజ చేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, లీడర్లు ముకుంద రెడ్డి, గొట్టే ప్రభాకర్, మల్లేశం, కుల సంఘ నాయకులు పాల్గొన్నారు.