ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్​ గెలుస్తది : ఆది శ్రీనివాస్​

వేములవాడ, చందుర్తి, వెలుగు : అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, డబ్బులు పంచినా ప్రజల మనస్సును గెలుచుకోలేరని వేములవాడ కాంగ్రెస్​ అభ్యర్థి ఆది శ్రీనివాస్​ అన్నారు. శుక్రవారం వేములవాడలో నిర్వహించిన సమావేశంలో సుమారు 200 మంది టీడీపీ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన శ్రీనివాస్​ మాట్లాడుతూ వేములవాడ గడ్డపై ఓ బీసీ బిడ్డ ఎదగడం ఓర్వలేక అగ్రకులాల వారు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.

యువత కాంగ్రెస్ విజయానికి పాటు పడాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు చంద్రగిరి శ్రీనివాస్​ గౌడ్​, రాంబాబు,  ఉపేందర్ గౌడ్, శ్రీధర్, మహ్మద్, కిషన్, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.   అంతకుముందు చందుర్తి, రుద్రంగి మండలాల్లో మున్నూరుకాపు సంఘం, ముదిరాజ్​సంఘం నాయకులు ఆది శ్రీనివాస్‌‌‌‌కు మద్దతు ప్రకటించారు. అనంతరం రుద్రంగి మండల కేంద్రంలో టపాసులు పేల్చి బతుకమ్మ ఆటలు ఆడుతూ ర్యాలీ నిర్వహించారు.