తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​దే అధికారం : ఆది శ్రీనివాస్​

వేములవాడ, కోనరావుపేట, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజల్లో నమ్మకం పోయిందని, వచ్చేది కాంగ్రెస్​ పార్టీనేనని, అధికారంలో కి రాగానే కాంగ్రెస్​ 6 గ్యారంటీలను అమలు చేస్తామని రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణం, కోనరావుపేట మండలాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వేములవాడలో గ్యారంటీ స్కీముల డిక్లరేషన్ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీఆర్ఎస్​గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.

Also Read : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ఎన్నికల కోసం కొత్త వేషాలతో వస్తారని, ప్రజలు నమ్మవద్దన్నారు. దళిత బంధు, బీసీ బంధు, అన్ని ఆ పార్టీ కార్యకార్తలకే  అందుతున్నాయన్నారు.  కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్  కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ లీడర్లు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్,  వకూళాభరణం శ్రీనివాస్​, తిరుపతి, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్వామి యాదవ్, కొమురయ్య, ఫిరోజ్ పాషా, గంగాధర్, రుక్మిణి, గోపాల్, భూమేశ్​పాల్గొన్నారు.