వేములవాడ, వెలుగు: కాంగ్రెస్ సర్కార్‌కు వేములవాడ రాజన్న ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సోమవారం న్యూ ఇయర్ సందర్భంగా రాజన్నను ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని వేడుకున్నానన్నారు.
కాంగ్రెస్ హయాంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అనంతరం పట్టణంలోని తిప్పాపూర్ తెలంగాణ చౌక్ వద్ద న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సిరిగిరి శ్రీ రాయులు, తిరుపతిరావు, గోలి శ్రీనివాస్.. ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి కనికరపు రాకేశ్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల, కోనరావుపేట, చందుర్తి
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోనరావుపేట, చందుర్తి మండలాల్లో నిర్వహించిన న్యూఇయర్వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కల్లూరు చందన సోమవారం ఎమ్మెల్యేను కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు.
అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల మమత, కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి,గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండలం సుద్దాల చర్చిలో జరిగిన వేడుకల్లో ఆది శ్రీనివాస్పాల్గొని మాట్లాడారు. చందుర్తి మండలం మూడపల్లి, ఎన్గల్ చర్చిల్లో కేక్ కట్చేసి పంపిణీ చేశారు.