బీఆర్ఎస్‌‌‌‌ను ప్రజలు తిరస్కరిస్తున్నరు : ఆది శ్రీనివాస్​

వేములవాడ, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్​కుటుంబం వారి సొత్తుగా మార్చుకున్నారని, బీఆర్ఎస్​ పార్టీని ప్రతి పల్లెలో తిరస్కరిస్తున్నారని  వేములవాడ కాంగ్రెస్​ అభ్యర్థి ఆది శ్రీనివాస్​ అన్నారు. శనివారం కథలాపూర్, వేములవాడ అర్బన్​ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడిపోతున్నామని బీఆర్ఎస్ ​లీడర్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అంతకుముందు మున్సిపల్ కార్మికులతో సమావేశమై కాంగ్రెస్‌‌‌‌కు ఓటేయాలని కోరారు. కూరగాయల మార్కెట్ లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులను, వ్యాపారులను కలిసి తనను గెలిపించాలని కోరారు.