కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే పేదల అభ్యున్నతి: ఆది శ్రీనివాస్

వేములవాడ, వేములవాడరూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తోనే పేదల అభ్యున్నతి సాధ్యమని వేములవాడ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్​ అన్నారు. వేములవాడ అర్బన్, రూరల్​మండలాల్లో గురువారం ఆయన ప్రచారం నిర్వహించారు. అనుపురం, హన్మాజీపేటలో పార్టీ ఆఫీసులను ప్రారంభించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన యువకులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో లీడర్లు పిల్లి కనకయ్య, రాజు, రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, కత్తి కనకయ్య, పరుశురాం, వకుళాభరణం శ్రీనివాస్, ఎంపీటీసీ శ్యామల, గోవర్ధన్ రెడ్డి, మల్లేశం, ప్రభాకర్, ఎల్లాగౌడ్, భూమయ్య, శ్రీనివాస్ గౌడ్, మహేందర్ పాల్గొన్నారు.