వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా : ఆది శ్రీనివాస్

చందుర్తి/కోనరావుపేట/ కథలాపూర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్‌‌‌‌,  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ అన్నారు. ఆదివారం రుద్రంగి, కోనరావుపేట, కథలాపూర్​మండలాల్లో ఆయన పర్యటించారు.  రుద్రంగి మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన రెండు పల్లె దవాఖానలు, గవర్నమెంట్‌‌‌‌ స్కూల్‌‌‌‌, ఎస్సీ హాస్టల్‌‌‌‌లో నిర్మించిన డైనింగ్​హాళ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ పల్లె దవాఖానలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రుద్రంగి మండలంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.  అనంతరం పంచాయతీ పాలకవర్గం, కార్మికులను సన్మానించారు. ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ మీనయ్య, సర్పంచ్ ప్రభలత,సెస్ డైరెక్టర్ గంగారాం పాల్గొన్నారు.  కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణంలో ఆది శ్రీనివాస్​పాల్గొన్నారు.  

కోనరావుపేట మండలం గోవిందరావుపేట తండాలో కొత్త పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మామిడిపల్లిలో కృతజ్ఞతా  ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని సీతారాముల ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణ, సర్పంచులు రజిత, భారతి, ఎంపీటీసీ యాష్మిన్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపు పరశురాములు పాల్గొన్నారు.