కోనరావుపేట, వెలుగు: మండలంలోని మామిడిపల్లిలో పల్లె దవాఖానను ప్రభుత్వ విప్ఎ, మ్మెల్యే ఆది శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ అరుణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ కొక్కుల భారతి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు పాల్గొన్నారు.