పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తాం : ఆది శ్రీనివాస్

వేములవాడరూరల్, వెలుగు: పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లి గ్రామంలో బుధవారం స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బోరు వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుల సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. అంతకుముందు బీరప్ప, చౌడాలమ్మ ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు.

అనంతరం ఫాజుల్​నగర్​, తుర్కాషినగర్​లో గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్​ పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్, సర్పంచ్ కరుణాకర్, సెస్​ డైరెక్టర్ దేవరాజం, సంఘ స్వామి యాదవ్, జాగిరి సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్, ఎల్లాగౌడ్, కాంగ్రెస్ ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు మల్లేశం లీడర్లు పాల్గొన్నారు.