కోనరావుపేట, కథలాపూర్, వెలుగు: కాంగ్రెస్‌తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమని, ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం కోనరావుపేట మండలం హనుమాన్ తండాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరల పాలనలో నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిందన్నారు. ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మండల కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రషీద్.. శ్రీనివాస్సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాడు.
కార్యక్రమంలో కిసాన్సెల్జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, లీడర్లు ఫిరోజ్ పాషా, గంగాధర్ పాల్గొన్నారు. అంతకుముందు కథలాపూర్ మండలంలో ఆది శ్రీనివాస్ప్రచారం చేశారు. పెగ్గెర్లలో యువకులు బైక్‌ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని కొనుగోలు సెంటర్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పలువురికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.