అడిచర్ల మహేశ్ స్మారక టోర్నీ ప్రారంభం

అడిచర్ల మహేశ్ స్మారక టోర్నీ ప్రారంభం

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక మంది క్రీడాకారులను అందించిన పుట్టినిల్లు బెల్లంపల్లి అని ఏసీపీ ఎ.రవికుమార్ అన్నారు. స్థానిక తిలక్ స్టేడియంలో ఆదివారం అడిచర్ల మహేశ్ స్మారక సీజన్-1 నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  కన్నాల బస్తీకి చెందిన ప్రముఖ స్టిల్‌ ఫొటోగ్రాఫర్ స్మృతిలో క్రికెట్ టోర్నీ నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని, జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ లీగ్​లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయని, ఏప్రిల్ 27 వరకు పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వన్‌ టౌన్ ఇన్‌స్పెక్టర్, ఎస్సై ఎస్‌ఐ ఎన్.దేవయ్య, నరేశ్,  తాండూర్ ఇన్‌స్పెక్టర్ కుమారస్వామి, నిర్వాహకులు అడిచర్ల హరీశ్, శివ, సుద్దాల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.