టీ20 వరల్డ్ కప్ కు సమయం ఆసన్నమైంది. మరో మూడు వారాల్లో ఈ పొట్టి సమరం ప్రారంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా జట్లు సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ జట్లన్నీ ప్రకటించేశారు. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ కోసం ఆయా దేశాలు తమ కొత్త జెర్సీలను రివీల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా సోమవారం (మే 6) టీమిండియా జెర్సీని ఆవిష్కరించారు. టీమ్ స్పాన్సర్ అడిడాస్ ఇండియా.. కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చూస్తుండగా హెలిక్యాప్టర్ ఎంట్రీతో జెర్సీని విడుదల చేశారు. అయితే, ఈసారి వరల్డ్ కప్ జెర్సీకి కాస్త కాషాయ రంగు అంటించారు.
ప్రస్తుతం టీమిండియా జెర్సీ ధర వైరల్ అవుతుంది. ఆన్ లైన్ లో ఈ జెర్సీ రూ. 5999 లకు సొంతం చేసుకోవచ్చు. ఈ ధర సామాన్యులను బయపెట్టినా..క్రికెట్ లవర్స్ ఈ జెర్సీ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మే 7 నుండి స్టోర్‌లలో, ఆన్‌లైన్‌లో adidas.co.inలో జెర్సీ అందుబాటులో ఉంటుందని.. అభిమానులు దానిని రూ.5999 లకు కొనుగోలు చేయవచ్చని అడిడాస్ తన ఎక్స్ లో తెలియజేసింది.
ప్రపంచ కప్ కోసం రూపొందించిన ఈ జెర్సీ.. గతంలో పోలిస్తే భిన్నంగా ఉంది. పూర్తి బ్లూ రంగు కాకుండా.. ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు ఉంది. భుజాలపై కాషాయ రంగు, తెలుపు రంగు అడ్డ గీతలు.. మిగతా భాగమంతా నీలి రంగుతో ఉంది. ఇక అడిడాస్ లోగో జెర్సీ కుడివైపు, బీసీసీఐ లోగో ఎడమవైపు ఉంది. చూడటానికి జెర్సీ చూడముచ్చటగా ఉన్నా.. నెట్టింట మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది.
కొందరు జెర్సీ బాగుందంటూ ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ కలర్ కాంబినేషన్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ సమయం కదా..! కాషాయ రంగు ఉంటుందని అంచనా వేశామంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే.. బట్టలు వాష్ చేయడానికి ఉపయోగించే సర్ఫ్ ఎక్సల్ కవర్‌లా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
The fans can buy India's T20 jersey online and from Adidas stores.#IndianCricketTeam #T20WorldCup2024 #CricketTwitter pic.twitter.com/eBUsRdJM31
— InsideSport (@InsideSportIND) May 7, 2024