
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో 119 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన విధంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ లో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారో చూద్దాం:
- ఆదిలాబాద్: బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం
- మంచిర్యాల: కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విజయం
- ఆసిఫాబాద్: బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మీ విజయం
- నిర్మల్: బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం
- బెల్లంపల్లి: కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కుమార్ విజయం
- చెన్నూరు: కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి విజయం
- బోథ్: బీఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం
- సిర్పూర్: బీజేపీ అభ్యర్థి పాల్పాయి హరీశ్ బాబు విజయం
- ఖానాపూర్: కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జ విజయం
- ముధోల్: బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ విజయం