![జడ్జిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి : బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్](https://static.v6velugu.com/uploads/2025/02/adilabad-bar-association-demands-strict-punishment-for-prisoner-who-attacked-woman-judge_gXKDhvBw3s.jpg)
ఆదిలాబాద్టౌన్, వెలుగు : రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై దాడికి పాల్పడ్డ ఖైదీని కఠినంగా శిక్షించాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం కోర్టులో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల భద్రతా వైఫల్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కేమ శ్రీకాంత్, మహేందర్ తదతరులు పాల్గొన్నారు.