ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంతో పాటు మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బక్కశెట్టి లక్ష్మణ్, బక్కశెట్టి కిషోర్, అమంద శ్రీనివాస్, తుము చరణ్, నేత శ్యామ్ తో పాటు ముదిరాజ్ సంఘ సభ్యులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సుగుణ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దోనికేని దయానంద్, నిమ్మల రమేశ్, కౌన్సిలర్లు షబ్బీర్ పాషా, కావలి సంతోష్, శంకర్, సురేశ్, నాయకులు తోట సత్యం, జహీర్, యూసుఫ్ ఖాన్, ఖాజా, గంగ నర్సయ్య, లక్ష్మీపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.