ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి
విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
జిల్లాలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. 2023లో 47 కేసులకు 17 కేసులు పెండింగ్ ట్రయల్లో, 25 కేసులు విచారణలో ఉన్నాయని, 5 కేసులు పూర్తయినట్లు తెలిపారు. కేసుల పరిష్కారానికి, బాధితులకు పరిహారం అందేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.