ఏఐ టెక్నాలజీని సరిగా వాడుకోవాలి : కలెక్టర్​ రాజర్షి షా

ఏఐ టెక్నాలజీని సరిగా వాడుకోవాలి : కలెక్టర్​ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్​(జైనథ్​), వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ఏఐ విద్య బోధన వల్ల స్టూడెంట్ల సామర్థ్యం పెరుగుతుందని కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. .  సోమవారం జైనథ్ మండలం పిప్పర్‌‌వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ శిక్షణ ను  కలెక్టర్​ ప్రారంభించారు.  అనంతరం పదో తరగతి విద్యార్థులకు హాల్‌ టికెట్స్ అందజేశారు.  జిల్లాలో 8 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు.

విద్యాశాఖ, ఏషియా ఫౌండేషన్ వారి సమన్వయంతో దేవాపూర్ 2 ఉర్దూ, తెలుగు మీడియం ప్రైమరీ స్కూల్, తాటిగూడ, కోడద్, బాలాపూర్, రణదీవ్ నగర్ , పిప్పర్ వాడ, అడ ల్లో  ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం పిప్పరవాడలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ కార్నర్ ను  పరిశీలించారు. కలెక్టర్​ వెంట డీఈఓ ప్రణీత, అధికారులు ఉన్నారు.