ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి :​కలెక్టర్​ రాజర్షి షా

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి :​కలెక్టర్​ రాజర్షి షా

నెట్​వర్క్, వెలుగు: ప్రజా సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు మండలాల నుంచి వివిధ సమస్యలపై 108 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఐటీడీఏ  సీఆర్ టీ, కేజీబీవీ, సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాదవ్ కలెక్టర్​ను కోరుతూ వినతిపత్రం అందజేశారు.

నేరడిగొండ మండల అధ్యక్షుడు రాథోడ్ సందీప్, ఆసిఫాబాద్ జిల్లా ఇన్​చార్జ్ బానోత్ రవీందర్, లైవ్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతీలాల్, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణతో కలెక్టర్​కుమార్​దీపక్ అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్ ఆర్డీఓ లోకేశ్వర్ రావుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు.

పింఛన్లు ఇప్పించాలని, కాలువలకు రిపేర్లు చేయించాలని, ఉపాధి కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి పథకం వర్తింపచేయాలని, పాసు పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందాయి. ఆసిఫాబాద్ మండలంలోని వావుదం గ్రామంలో స్కూల్ బిల్డింగ్ నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు, స్టూడెంట్స్ వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్మల్​అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి విద్య, వైద్యం,వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు, రైతు రుణమాఫీ వంటి సమస్యలను పరిష్కరించాలని వచ్చిన ధరఖాస్తులను స్వీకరించారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి తదితరులు పాల్గొన్నారు.