సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

 సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
  • సర్వేను పరిశీలించిన కలెక్టర్లు

ఆసిఫాబాద్/గుడిహత్నూర్/నస్పూర్, వెలుగు: కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. శనివారం గుడిహత్నూర్‌ మండలం తోషంలో నిర్వహిస్తున్న సర్వేను కలెక్టర్‌ పరిశీలించారు. అవసరమైతే ఎన్యుమరేటర్లకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని నోడల్‌ అధికారులకు సూచించారు. ఇంటింటికీ అతికించిన స్టిక్కర్లను పరిశీలించి, సర్వేకు సంబంధించిన ప్రొఫార్మాలను పరిశీలించారు.

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో నిర్వహిస్తున్న సర్వే తీరును కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. సర్వే లక్ష్యాలు నెరవేర్చే బాధ్యత ఎన్యుమరేటర్లపై ఉందన్నారు. నిర్దేశించిన ఫారంలో ఇచ్చిన ప్రతి అంశాన్ని ప్రజల వద్ద నుంచి సేకరించాలన్నా. ఏ ఇంటిని వదిలిపెట్టొద్దని, అందుబాటులో లేని వారి దగ్గరికి మరోసారి వెళ్లాలని సూచించారు.

సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సిబ్బందికి సూచించారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5,6,17 వార్డుల్లో నిర్వహిస్తున్న సర్వేను పర్యవేక్షించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సతీశ్, వార్డు కౌన్సిలర్ మేకల దాసు తదితరులున్నారు.