ఓటమి భయంతోనే..బాల్క సుమన్​ కోవర్టు డ్రామా

  •     మండిపడ్డ కాంగ్రెస్​ లీడర్లు

కోల్​బెల్ట్​, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భయపడుతున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కాంగ్రెస్​లో తమ కోవర్టులు ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ​శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, ప్రజలను తప్పుదోవపట్టించే కుట్రలో భాగంగా కోవర్టు డ్రామాల ఆడుతున్నాడని ఫైర్​ అయ్యారు. ఆదివారం మందమర్రి, క్యాతనపల్లిలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో పీసీసీ జనరల్​సెక్రటరీ పిన్నింటి రాఘునాథ్ ​రెడ్డి, చెన్నూరు నుంచి కాంగ్రెస్ టికెట్​ఆశిస్తున్న నూకల రమేశ్, డాక్టర్​ రాజారమేశ్​మాట్లాడారు. కాంగ్రెస్​లో కోవర్టులెవరూ లేరని, బీఆర్​ఎస్​ లీడర్లను తానే పంపించినట్లు  బాల్క సుమన్​ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. 

స్థానికేతరుడైన సుమన్​ను ఓడించేందుకు బీఆర్​ఎస్ లీడర్లే సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం బ్యాక్​వాటర్ ​కారణంగా వేల ఎకరాల్లో పంట ముంపుకు గురవుతున్నా  రైతులకు నష్టపరిహారం కూడా ఇప్పించలేని అసమర్థుడు బాల్క సుమన్​ అని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవి కోసం తోటి దళితుడు నల్లాల ఓదెలుకు రాజకీయ జీవితం లేకుండా చేశాడని, ఇందారంలో మరో దళితుని ప్రాణాలు పోవడానికి కారకుడని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్​ టౌన్​ ప్రెసిడెంట్​ నోముల ఉపేందర్​గౌడ్, సోషల్​మీడియా స్టేట్​సెక్రటరీ ముజాహిద్, లీడర్లు మండ భాస్కర్, పుల్లూరి లక్ష్మణ్, గందె రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.