దేశ వ్యాప్తంగా ఢిల్లీలోని నిజాముద్దీన్ లో మర్కజ్ సమావేశం సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు. ఈ సమావేశం తర్వాత దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్ లో పెరిగాయో అందరికీ తెలుసు. వెంటనే అలర్ట్ అయిన కేంద్రం నిజాముద్దీన్ సమావేశానికి వెళ్లిన వారందరినీ జల్లెడ పట్టి మరీ టెస్టులకు, క్వారంటైన్ కు పంపించింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 9 వేలు దాటాయి.80 శాతం కరోనా కేసులు నిజాముద్దీన్ కు సంబంధించినవే..
నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారికి కరోనా వచ్చినట్లు మొదటి కేసు తెలంగాణలో బయటపడింది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరు యూపీలోని దియోబంద్ కు వెళ్లి వచ్చారని అనుమానిస్తున్నారు. అయితే నిజాముద్దీన్ తరహాలో యూపీలో దియోబంద్ మత ప్రార్థనలకు పలు రాష్ట్రాల నుంచి వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దియోబంద్ కు ఎవరెవరు వెళ్లారనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.