ముగ్గురు దోషులకు ఉరిశిక్ష రద్దు.. ప్రాణం ఉన్నంతకాలం జైలుశిక్ష 

  • రేప్, మర్డర్  కేసులో కోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: మహిళపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన ముగ్గురు దోషులకు ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రత్యేక కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు రద్దు చేసింది. అయితే వారికి 14 ఏండ్ల యావజ్జీవ శిక్ష కాకుండా ఊపిరి ఉన్నంతకాలం జైల్లోనే ఉంచాలని, వారు ఏవిధమైన క్షమాభిక్షకు అర్హులు కాదని తీర్పు చెప్పింది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా లింగాపూర్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌  పరిధిలో ఓ మహిళపై 2019 నవంబర్‌‌‌‌‌‌‌‌లో షేక్‌‌‌‌‌‌‌‌  బాబు, షేక్‌‌‌‌‌‌‌‌  షాబుద్దీన్, షేక్‌‌‌‌‌‌‌‌  మక్దూమ్‌‌‌‌‌‌‌‌ అత్యాచారం చేసి, హత్య చేశారు.

ఈ కేసులో వాళ్లకు ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌  ప్రత్యేక కోర్టు 2020లో ఉరిశిక్ష విధించింది. దీనిపై దోషులు హైకోర్టుకు వెళ్లగా.. జస్టిస్‌‌‌‌‌‌‌‌  పి.నవీన్‌‌‌‌‌‌‌‌రావు, జస్టిస్‌‌‌‌‌‌‌‌  జువ్వాది శ్రీదేవిల బెంచ్‌‌‌‌‌‌‌‌ విచారణచేసి తీర్పు వెలువరించింది. కింది కోర్టు వేసిన ఉరిశిక్షను జీవితాంతం కారాగార శిక్షగా మారుస్తూ తీర్పు చెప్పింది. తుది శ్వాస విడిచే వరకు దోషులు జైల్లోనే జీవితం గడపాలని, వారు క్షమాభిక్షకు అర్హులు కాదని తేల్చి చెప్పింది.