ఆదిలాబాద్ జిల్లా తుది ఓటర్ జాబితా విడుదల

ఆదిలాబాద్ జిల్లా తుది ఓటర్ జాబితా విడుదల

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  జిల్లా తుది ఓటరు జాబితాను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆదిలాబాద్​, బోథ్​ నియోజకవర్గాలు కలిసి మొత్తం 4,61,870 ఓటర్లు కాగా అందులో పురుషులు 2,24,604 మంది ఓటర్లు, మహిళలు 2,37,258 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఆదిలాబాద్​ నియోజకవర్గంలో మొత్తం 2,47,861 మంది ఓటర్లు కాగా పురుషులు 1,21,050 మంది,  మహిళలు 1,26,805 మంది, బోథ్​ నియోజకర్గంలో మొత్తం ఓటర్లు 2,14,009 మంది కాగా పురుషులు 1,03,554 మంది, మహిళలు 1,10,453 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తుది ఓటరు జాబితాలు ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.