బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుతుండగా, ప్రాజెక్టుల్లోకి వరద పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడన్న నమ్మకం కనిపించడం లేదు. చాలా చోట్ల రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం చిద్దారి ఖానాపూర్ లో బారి వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో సట్వాజిగూడ ,మార్కాగూడ ,బుర్సాన్ పటార్ ,నోవాగూడ ,లోహర్ ,ఖండాల, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పలుచోట్ల నీటి మధ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రవాహం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. వాగు ఎక్కడ పొంగి ప్రవహిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎటు చూసిన నీరే.. చిన్న కాలువ నుంచి పెద్ద వాగు వరకు.. అంతా నీరే. కాల్వలు, వాగులు పొంగిపొర్లుతుండటంతో రహదారులు స్థంబించిపోయాయి.