పదో తరగతి స్టూడెంట్ మిస్సింగ్.. కేసు నమోదు

కాగజ్ నగర్ , వెలుగు: టీసీ కోసం తాను చదివిన రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్లిన స్టూడెంట్ మిస్ అయింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తండ్రి పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కౌటాల మండల కేంద్రంలోని నదీమాబాద్ కి చెందిన  స్టూడెంట్ కామ్రే శ్రీవాణి (17)  ఈనెల 13 న సిర్పూర్ టీ లో తాను చదివిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి టీసీ కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఇటీవల పదో  తరగతి పూర్తి చేసిన శ్రీవాణి మంగళవారం ముగ్గురు స్నేహితులతో కలిసి సిర్పూర్ టీ కి బస్సులో వెళ్లింది. అక్కడ స్నేహితులను కలవకుండా ఎటో వెళ్లిపోయింది. సాయంత్రం వరకు అక్కడే వేచి చూసిన స్నేహితులు తిరిగి వచ్చారు.

శ్రీవాణి కనిపించని విషయంపై తల్లిదండ్రులకు చెప్పగా తండ్రి గోవర్ధన్ , ఇతర కుటుంబీకులు వెతికారు. స్టూడెంట్ ఆచూకీ లభించలేదు. దీంతో కౌటాల పొలీస్ స్టేషన్ లో తండ్రి గోవర్ధన్ ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.