బెల్లంపల్లిలో అట్టహాసంగా బాడీ బిల్డింగ్ పోటీలు

  •     మిస్టర్ ఐరన్  మ్యాన్​గా అన్వర్ 

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి కేంద్రంగా రెండోసారి స్కై జిమ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి అన్నారు. ఆదివారం రాత్రి ఏఎంసీ క్రీడా మైదానంలో జరిగిన పోటీలను వారు ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పాల్గొన్న బాడీ బిల్డర్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

మంచిర్యాలకు చెందిన బాడీ బిల్డర్ అన్వర్​ మిస్టర్ ఐరన్ మ్యాన్ టైటిల్ దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మిస్టర్ బెల్లంపల్లిగా జి.లక్ష్మణ్ గెలుపొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్​ఐలు నరేశ్, ఉదయకిరణ్, మాజీ మిస్టర్ ఇండియా (రైల్వేస్) పి. రాజు, జిల్లా  బాడీ బిల్డింగ్ అసోసియేషన్

 కార్యదర్శి జి.రాకేశ్, మిస్టర్ కోల్ ఇండియా బాడీ బిల్డర్లు జె.నాగమల్లేశ్వర్ రావు, ఒరం సురేశ్,  జెట్టి మురహరి రావు, స్కై జిమ్ నిర్వాహకులు పి.సదానందం, చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.