ఖానాపూర్/నార్నూర్,వెలుగు: ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం ఖానాపూర్‌లో కుమ్రంభీం వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ సోయం బాపూరావు హాజరై మాట్లాడారు. భీం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. తెలంగాణలో ఆదివాసీ గిరిజనులకు సరైన న్యాయం జరగడంలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ నాయకుడు అజ్మీర హరినాయక్, అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజశేఖర్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందూర్ మాధవ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు సందుపట్ల శ్రావణ్, లీడర్లు స్వామి, సురేశ్, సుధాకర్, గిరి, లీడర్లు అంకుశ్రావు, అర్జున్, లింగు తదితరులు ఉన్నారు. నార్నూర్‌లో జరిగిన వర్ధంతికి జడ్పీ చైర్మన్ రాథోడ్‌జనార్దన్, ఆసిఫాబాద్ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరై నివాళి అర్పించారు. ఎంపీపీ కనక మోతుబాయి, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కనక ప్రభాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, ఆదివాసీ లీడర్లు, భీం నిర్వహణ కమిటీ సభ్యులు సీతారం, రూప్ దేవ్ పాల్గొన్నారు.
- పర్యావరణ పరిరక్షణకు సింగరేణి కృషి
- డైరెక్టర్(ఫైనాన్స్, పీపీ) బలరాం నాయక్
మందమర్రి/నస్పూర్,వెలుగు: సింగరేణి ఏరియాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కృషిచేస్తున్నట్లు డైరెక్టర్(ఫైనాన్స్, పీపీ) ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గురువారం ఆయన మందమర్రి, శ్రీరాంపూర్ఏరియాల్లో పర్యటించారు. కాసిపేటలో అడిషనల్ డీజీపీ అంజనా సిన్హాతో కలిసి 350 మొక్కలు నాటారు. భవిష్యత్తరాలకు మంచి గాలి, నీరు అందించడానికి ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని బలరాం నాయక్చెప్పారు. కార్యక్రమంలో మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల జీఎంలు చింతల శ్రీనివాస్, బి.సంజీవరెడ్డి, ఎస్వోటు డైరెక్టర్ సుధాకర్‌రావు, ఎస్వోటు జీఎం కృష్ణారావు, కేకే ఓసీపీ, ఎస్సార్పీ ఓసీపీ పీవోలు రమేశ్, పురుషోత్తంరెడ్డి, మేనేజర్లు మల్లన్న, జనార్దన్, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ఏరియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజా రమేశ్, కార్మిక సంఘాల లీడర్లు మేడిపల్లి సంపత్, సలెంద్ర సత్యనారాయణ, ఫారెస్ట్ ఆఫీసర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డుల సంక్షేమానికి కృషి
ఆదిలాబాద్‌టౌన్,వెలుగు: హోంగార్డుల సంక్షేమానికి కృషిచేస్తున్నామని హోంగార్డు కమాండెంట్ ఐఆర్ఎస్ మూర్తి చెప్పారు. గురువారం ఆయన జిల్లాకు వచ్చి హోంగార్డుల పరేడ్ ను పరిశీలించారు. కమాండర్ భూమన్న ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం హోంగార్డ్ ఆఫీసు, రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ ఎం.వంశీకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీలకు అన్యాయం చేసిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ టౌన్,వెలుగు: ఆదిలాబాద్ చరిత్రలో తొలిసారి ఆదివాసీ మహిళకు కేటాయించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఏడాదిగా వారికి కేటాయించకుండా ఎమ్మెల్యే జోగు రామన్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని జడ్పీ మాజీ చైర్ పర్సన్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుహాసినిరెడ్డి ఫైర్అయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డును ఆమె సందర్శించారు. పాలకవర్గాన్ని నియమించకుండా పంటలు కొనుగోలు చేయడమేమిటన్నారు. కార్యక్రమంలో లీడర్లు గన్నొజి విజయ్, సర్పంచ్ చందర్ షా, గందేవిజయ్ కుమార్, గటిక క్రాంతి కుమార్, మోహన్ అగర్వాల్, సతీశ్‌రెడ్డి, కాంతారావు, కొత్తపెళ్లి సంతోష్, లంక శ్రీను, తోకల నరేశ్, కాంత, ముఖీం, అనూప్, ప్రశాంత్, శివ కిరణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
నలుగురు ట్రాన్స్ ఫార్మర్ దొంగల అరెస్ట్
నిర్మల్,వెలుగు: స్థానిక గాయత్రి టౌన్ షిప్ సమీపంలోని మూతపడ్డ క్రషర్ నుంచి ట్రాన్స్ ఫార్మర్ దొంగిలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం మహాలక్ష్మి వాడకు చెందిన బాణాల చిరంజీవి, కడారి శ్రీధర్, సుధాకర్, కడారి నారాయణ రూ. 1.80 లక్షల విలువచేసే ట్రాన్స్ఫార్మర్దొంగిలించి మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో బంగల్ పేట్ చెరువు కట్టపై ఎస్సై రమణారావు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని సీఐ వివరించారు.
క్వాలిటీ కరెంట్ సప్లై చేయండి
నిర్మల్,వెలుగు: విద్యుత్‌వినియోగదారులకు క్వాలిటీ కరెంట్సరఫరా చేయాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఐపీసీ గణపతి ఆదేశించారు. గురువారం ఏడీఈ, ఏఈలతో రివ్యూ నిర్వహించారు. వంద యూనిట్లలోపు కరెంట్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ వినియోగ దారులు సబ్సిడీ కోసం కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాలన్నారు. బిల్లుల బకాయిలు ఎప్పటికప్పడు వసూలు చేయాలన్నారు. విద్యుత్ వినియోగం పెరిందని, సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. రైతులందరూ కెపాసిటర్లు బిగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈలు శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
నలుగురు ట్రాన్స్ ఫార్మర్ దొంగల అరెస్ట్
నిర్మల్,వెలుగు: స్థానిక గాయత్రి టౌన్ షిప్ సమీపంలోని మూతపడ్డ క్రషర్ నుంచి ట్రాన్స్ ఫార్మర్ దొంగిలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం మహాలక్ష్మి వాడకు చెందిన బాణాల చిరంజీవి, కడారి శ్రీధర్, సుధాకర్, కడారి నారాయణ రూ. 1.80 లక్షల విలువచేసే ట్రాన్స్ఫార్మర్దొంగిలించి మహారాష్ట్రకు తరలిస్తున్న క్రమంలో బంగల్ పేట్ చెరువు కట్టపై ఎస్సై రమణారావు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని సీఐ వివరించారు.
ఓసీపీ డ్యూటీలకు వెళ్లాలంటే భయం
మందమర్రి,వెలుగు: బెల్లంపల్లి ఏరియా ఖైరీగూడా ఓసీపీ మైన్‌కు వెళ్లే దారిలో పులిసంచారంతో ప్రీషిఫ్ట్డ్యూటీల కోసం వెళ్లేందుకు సింగరేణి ఎంప్లాయీస్ భయపడుతన్నారని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం డైరెక్టర్ (ఫైనాన్స్, పా) బలరామ్ నాయక్‌ను రామగుండంలో కలిసి వినతిపత్రం అందించారు. ఖైరీగూడా ఓసీపీకి వెళ్లేందుకు గోలేటి నుంచి 18 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. ఈ మార్గంలో పులుల సంచారం ఉందని, తెల్లవారుజామున ప్రీషిఫ్ట్డ్యూటీలకు ఓవర్‌మన్ ఎంప్లాయీస్ వెళ్లేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. గోదావరిఖనిలోని సీఎంపీఎఫ్ ఆఫీస్ కోసం సింగరేణి కోట్లాది ఫండ్స్చెల్లిస్తుందని, కనీసం ఎంప్లాయీస్ గేట్ దాటనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు డైరెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. రివ్యూ మీటింగ్ఏర్పాటు చేసి సీపీఆర్ ఎంఎస్పెండింగ్ సమస్యలు పరిష్కారించాలని కోరారు. రిటైర్డు ఎంప్లాయీస్ గ్రాట్యూటీ క్లెయిమ్విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. డైరెక్టర్‌ను కలిసినవారిలో ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహా రెడ్డి, ధర్మపురి, గుమ్మడి కుమార స్వామి, సెంట్రల్ జాయింట్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్, సీనియర్ లీడర్లు మనోహర్, సెంట్రల్ క్యాంపేనింగ్ఇన్చార్జి వికాస్ కుమార్ యాదవ్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు పవన్ కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థి మిస్సింగ్
లోకేశ్వరం,వెలుగు: మండలంలోని పోట్ పెల్లి(బి) గ్రామానికి చెందిన విద్యార్థి జశ్వంత్(14) అదృశ్యం అయినట్లు ఎస్సై సాయికుమార్
తెలిపారు. గ్రామానికి చెందిన చిన్న ముత్తన్న కొడుకు జశ్వంత్బోధన్లోని ఇందూర్స్కూల్లో చదువుకుంటున్నాడు. దసరా సెలవులకు స్వగ్రామానికి వచ్చి ఈనెల 12 తిరిగి స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటినుంచి వెళ్లాడు. స్కూల్యాజమాన్యానికి తల్లిదండ్రులు ఫోన్‌చేయగా జశ్వంత్ఇంకా రాలేదని చెప్పారు. ఆందోళనకు గురైన పేరెంట్స్బంధువులు, తెలిసిన వారికి ఫోన్‌చేసినా ఆచూకీ దొరకలేదు. తండ్రి ముత్తన్న ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
బాలికలు క్రీడల్లో రాణించాలి
ఆదిలాబాద్,వెలుగు: బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. ఆదిలాబాద్జ్యోతిబాపులే బాలికల పాఠశాలలో ప్రారంభమైన జిల్లా స్థాయి అండర్ –14, 19 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలకు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో 11 జ్యోతి బాపులే స్కూళ్లు, ఆరు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు పాల్గొంటారని కలెక్టర్‌తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పాఠశాల విద్య, క్రీడలకు సీఎం కేసీఆర్ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్వో భీంకుమార్, ప్రిన్సిపల్ అంజలి దేవి, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, పెట ప్రధాన కార్యదర్శి స్వామి ఉన్నారు.
- గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు
- కలెక్టర్ భారతిహోళ్లికేరి
- జిల్లాలో 27 కేంద్రాల ఏర్పాటు
ఆదిలాబాద్/మంచిర్యాల,వెలుగు: గ్రూప్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆదిలాబాద్, మంచిర్యాల కలెక్టర్లు సిక్తాపట్నాయక్, భారతీహోళికెరి చెప్పారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలో 9,243 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని, వీరి కోసం 27 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్భారతీ హోళికెరి తెలిపారు. ఈనెల 16న ఉదయం 8.30 గంటలకు బయోమెట్రిక్ అటెండెన్స్తీసుకుంటామన్నారు. అభ్యర్థులు సమయానికి చేరుకోవాలని సూచించారు. ఆదిలాబాద్‌లో 6,519 మంది పరీక్ష రాస్తారని కలెక్టర్సిక్తాపట్నాయక్తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూం 18004251939 నంబర్‌కు కాల్చేసి చెప్పాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రిజ్వన్ బాషా, నటరాజ్ పాల్గొన్నారు.
- దంపతులను హత్యచేసిన ఐదుగురి అరెస్ట్
- నిందితులను పట్టించిన సీసీ పుటేజీ
జన్నారం, వెలుగు: జన్నారం మండలం చింతలపల్లే గ్రామానికి చెందిన జింక లచ్చన్న– రాజేశ్వరి దంపతులను హత్య చేసిన అదే గ్రామానికి చెందిన గూడ సతీశ్, గూడ భూలక్ష్మి, గూడ మల్లవ్వ, లక్ష్మి, గూడ లచ్చన్నను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లక్సెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన జింక లచ్చన్న, గూడ సతీశ్ కుటుంబాలు పక్కపక్కానే ఉంటాయి. దీంతో జింక లచ్చన్న కూతురు లక్ష్మి ఆరోగ్యం బాగలేకపోవడంతో గూడ సతీశ్ కుమారుడు రాజు సహాయంతో కరీంనగర్‌కు చెందిన షోయాబ్ వద్ద వైద్యం చేయించుకుంది. ఈ క్రమంలో లక్ష్మి, షోయాబ్ మధ్య పరిచయం ఏర్పడంతో రెండు సంవత్సరాల క్రితం లక్ష్మి కొంత బంగారం, డబ్బులు షోయాబ్‌కు ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగిన షోయాబ్ వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో రాజుతోనే షోయాబ్ పరిచయం అయ్యాడని, డబ్బులు, బంగారం ఇప్పించాలని లక్ష్మి తల్లిదండ్రులు జింక లచ్చన్న– రాజేశ్వరి దంపతులు రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. తరచూ గొడవపడ్డారు. ఇది జరుగుతుండగానే రాజు బతుకుదెరువు కోసం ఇరాక్వెళ్లిపోయాడు. తన ఇంటిపై తరచూ గొడవకు వస్తున్న లచ్చన దంపతులను చంపివేయాలని రాజు తండ్రి గూడ సతీశ్ నిర్ణయించుకున్నాడు. దీనికోసం భార్య భూలక్ష్మి, అక్క మల్లవ్వ, తల్లి లక్ష్మి, అన్న వరుసైన గూడ లచ్చన్న సహకారం కోరాడు. ఈనెల 11న సాయంత్రం లచ్చన్న– రాజేశ్వరి దంపతుల మరోసారి గొడవకు దిగడంతో ముందుస్తూ ప్లాన్ ప్రకారం గూడ సతీశ్, మిగిలిన నలుగురు దంపతుల తలలపై మంచం పట్టితో బలంగా కొట్టారు. దీంతో వారు అక్కడికిఅక్కడే మృతిచెందారు. నిందితులు గురువారం సాయంత్రం జన్నారం బస్టాండ్ నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై సతీశ్ తదితరులు ఉన్నారు.
కిరాయి డబ్బులు అడిగితే హత్యాయత్నం
నిర్మల్,వెలుగు: నిర్మల్బాగులవాడలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇద్దరు యువకులు ఆ ఇంటి యజమాని బంధువు కిరాయి డబ్బులు అడిగారన్న కోపంతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. టౌన్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. బాగులవాడలో అల్లం కమల అనే మహిళ ఇంట్లో నాలుగు నెలలుగా పుట్ల శివకుమార్, నాయుడు రాజు అనే యువకులు అద్దెకు ఉంటున్నారు. రెండు నెలల నుంచి కిరాయి సక్రమంగా ఇవ్వకపోవడంతో యజమాని కమల తన బంధువు సాయిరాం సహకారంతో నిలదీశారు. దీంతో ఇద్దరు యువకులు యజమానురాలి బంధువు సాయిరాంపై దాడిచేశారు. ఇంట్లో ఉన్న కత్తితో హత్య చేసేందుకు ప్రయత్నించారు. యజమాని కమల ఫిర్యాదు మేరకు నిందితులు పుట్ల శివకుమార్, నాయుడు రాజును
వీహెచ్ పీ అధ్యక్షుడికి పరామర్శ
భైంసా,వెలుగు: పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ టౌన్ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్ తల్లి గంగామణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. గురువారం మహిపాల్కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్, కౌన్సిలర్ కపిల్, లీడర్లు సాయినాథ్, గాలి రవి, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
‘అక్షరజ్యోతి’పై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ఆదిలాబాద్, వెలుగు: రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశపెట్టిన అక్షర జ్యోతి కార్యక్రమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి హెచ్చరించారు. గురువారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో అక్షరజ్యోతి అమలు, విద్యార్థుల సామర్థ్యం, ఉత్తీర్ణత శాతం తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు. ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ఈజీగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని, ఇది పునరావృతమైతే హెచ్ఎంలపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ దిలీప్ కుమార్, ఆసిఫాబాద్, మంచిర్యాల డీటీడబ్ల్యూవోలు మణెమ్మ, నీలిమా, ఏటీడబ్ల్యూవోలు సౌజన్య, నిహారిక తదితరులు పాల్గొన్నారు.