ఆదిలాబాద్ లో పోలీసులు వర్సెస్ భూ నిర్వాసితులు

ఆదిలాబాద్ జిల్లా రాంపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు తమకు తిరిగి ఇవ్వాలని పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా ఎండ్ల బండ్లతో ఫ్యాక్టరీ భూముల వరకు ర్యాలీ నిర్వహించారు. సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన భూములు తమకు తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశారు.

భూ నిర్వాసితులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నంచారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ సీఐ కాళ్లమీద పడ్డారు. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన తమ భూములు స్వాధీనం చేసుకోవడానికి అనుమతినివ్వాలని పోలీసులను కోరారు.