ఆసిఫాబాద్, వెలుగు: మునుగొడు బై ఎలక్షన్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ గుండాలు దాడులు చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్నాక్ విజయ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చెర్ల మురళి, మండల అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షుడు పసునూరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, లీడర్లు రామగిరి విశాల్, ఆత్రం సాయినాథ్, తిరుపతి, వెంకన్న, నరేశ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
గిరి వికాసం ద్వారా రైతులకు మేలు
నార్నూర్, వెలుగు: గిరివికాసం ద్వారా రైతులకు మేలు జరుగుతోందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్జడ్పీ చైర్మన్జనార్దన్రాథోడ్ చెప్పారు. మల్లంగి గ్రామానికి చెందిన 16 మంది రైతులకు మంజూరైన మోటారు పంపుసెట్లను మంగళవారం వారు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పూసం రూపాబాయి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, విద్యుత్తు శాఖ ఎస్సీ ఉత్తమ్ జాడే, డీఆర్డీఏ ఏపీడీ రవీందర్, లీడర్లు కనక ప్రభాకర్ రాథోడ్, రమేశ్ కాంతారావు, దుర్గే కొర్రాల మహేందర్ తదితరులు ఉన్నారు.
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలె
లక్సెట్టిపేట,వెలుగు: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని లక్సెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సుమన్ గ్రేవాల్ సూచించారు. మంగళవారం స్థానిక కోర్టులో అడ్వకేట్లు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 12న న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, సీఐ కరీముల్లాఖాన్, అడ్వకేట్లు కేతిరెడ్డి భూమారెడ్డి, అక్కల శ్రీధర్, కొత్త సత్తయ్య, తిప్పని రవికుమార్, ఆవునూరి సత్తయ్య, ఎస్కే తాజొద్దిన్, కూడెల్లి అశోక్, సట్ట రవి రాజ్ తదితరులు పాల్గొన్నారు.
పాలకమండలి ఏర్పాటు చేయాలె
ఆసిఫాబాద్,వెలుగు: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు తక్షణమే పాలకమండలి ఏర్పాటు చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం రెబ్బెన మండలం గోలేటి కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతీ కార్మికుడికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. నిర్మాణ పనుల నుంచి వసూలు చేస్తున్న సెస్ఒకటి నుంచి రెండు శాతానికి పెంచాలన్నారు. కార్మికుల పిల్లల పెండ్లిలకు రూ. లక్ష సహాయం చేయాలన్నారు. మహిళా కార్మికులకు కనీస వేతనంతో కూడిన ఆరు మాసాల ప్రసూతీ సెలవులు ఇవ్వాలన్నారు. అర్హులైన కార్మికులకు రూ. 6 వేల పెన్షన్ఇవ్వాలన్నారు. పని చేస్తూ చనిపోయిన కార్మికులకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం రవీందర్, లీడర్లు రఫిక్, రవి, లింగయ్య, బాబురావు, రాజేశ్, భీమేశ్, తులసీరాం, భీమేశ్, పోశమల్లు పాల్గొన్నారు.
కార్మిక సంఘాలను ప్రభుత్వాలు పట్టించుకుంటలె
నస్పూర్, వెలుగు: కార్మిక సంఘాలను ప్రభు త్వాలు పట్టించుకోవడంలేదని సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు పి.రాజారావు ఆరోపించారు. లేబర్కోడ్లను మార్చడంతో కార్మికులకు నష్టం కలుగుతోందన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే6 గనిపై బ్రాంచి సెక్రటరీ గోదారి భాగ్యరాజు ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కార్మికులందరూ
ఐక్యంగా పోరాడి సంఘాలను పటిష్టం చేసుకోవాలన్నారు. అనంతరం -రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ గుర్తింపు సంఘం సీఎం కేసీఆర్‌ను లాభాల వాటా అడిగే పరిస్థితిలో లేదన్నారు. ఎన్నికలప్పుడు కార్మికులకు సొంతింటి పథకం, ఆదాయపన్ను మాఫీ గురించి మాట్లాడిన నాయకులను కార్మికులు నిలదీయాలన్నారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ డివిజన్ అధ్యక్షుడు విడివల్లి శంకర్, ఉపాధ్యక్షులు బాలాజీ, కస్తూరి చంద్రశేఖర్, వెంగళ శ్రీనివాస్, రాజేశం, సతీశ్, అజయ్ పాల్గొన్నారు.
సమస్యలు చెప్తే.. బెదిరిస్తారా..?
భైంసా, వెలుగు: పల్సికర్ రంగారావు ప్రాజెక్టు కారణంగా ఇబ్బంది పడుతున్న బాధితులు సమస్య పరిష్కరించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి ఫోన్‌చేస్తే బెదిరింపులకు పాల్పడడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్ఫైర్అయ్యారు. మంగళవారం స్థానికంగా మీడియాతో మాట్లాడారు. గుండెగాం గ్రామం పదేళ్లుగా రంగారావు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ తో నీట మునుగుతోందన్నారు. ఈ విషయాన్ని చేప్పేందుకు మంత్రి, ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. గుండెగాం వాసులకు శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.