ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల,వెలుగు: తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నెన్నెల మండలం కుశ్నపల్లి, కోనంపేట గ్రామాల గిరిజనులు డిమాండ్ చేశారు. బుధవారం రెండు గ్రామాలకు చెందిన పోడు రైతులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ కు తరలివచ్చారు. కుశ్నపల్లి శివారులోని సర్వేనంబర్ 57లో 228 ఎకరాల్లో 2001 నుంచి 2006 వరకు పంటలు సాగు చేశామన్నారు. కానీ రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లు తాము సాగులో లేమని తప్పుడు సమాచారం ఇవ్వడంతో గ్రామంలో సర్వే జరగలేదని తెలిపారు. వెంటనే ఫారెస్ట్ రైట్స్ కమిటీని ఏర్పాటు చేసి పట్టాలు అందించాలని కోరారు. అలాగే కోనంపేటలో చాలామంది పోడు రైతులకు అవగాహన లేకపోవడంతో నిరుడు దరఖాస్తులు చేసుకోలేదన్నారు. సంబంధిత రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్కు మెమోరాండం అందజేశారు. ఆదివాసీ గిరిజన కొలవారి సంఘం అధ్యక్షురాలు ఎలిగేటి లక్ష్మి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్మ పున్నం తదితరులు పాల్గొన్నారు. 

కుమ్రంభీం స్ఫూర్తితో ముందుకు సాగాలి

కాగజ్ నగర్,వెలుగు: ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని జడ్పీ వైస్​చైర్మన్​కోనేరు కృష్ణారావు చెప్పారు. గురువారం కాగజ్ నగర్, కౌటాల మండలం వీర్ధండిలో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాగజ్ నగర్ లో జరిగిన కార్యక్రమానికి కృష్ణారావు హాజరై నివాళి అర్పించారు. వీర్దండిలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ మడావి రేణుక పోచాని, ఉప సర్పంచ్ బండు, సంఘం పెద్దలు పర్చాకే రాంచందర్, ఆత్రం నాందేవ్, పెందర్ సంతోష్, సిడాం పరుశురాం, తలండి దిలీప్, సిడం అశోక్ తదితరులు  గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉపసర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సహాయం

జైపూర్,వెలుగు: మండలంలోని నర్వ గ్రామనికి చెందిన ఉప సర్పంచ్ చంద్రకల భర్త సురేందర్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఉప సర్పంచుల సంఘం అండగా నిలిచింది. గురువారం జిల్లా ఉపసర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రూ. 60 వేల ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు మాధవరపు జితేందర్ రావు, ప్రధాన కార్యదర్శి పిట్టల సుమన్, ఉపసర్పంచులు తిరుపతి, బోయిని తిరుపతి, వెంకటస్వామి, సాగర్, నగేశ్, వెంకటస్వామి, రౌతు వెంకటేశ్, గోనె మోహన్ రెడ్డి, సుమన్, శ్యామ్, తిరుమలవాస్, సాయిలు పాల్గొన్నారు.

31న కోటి దీపోత్సవం

భైంసా,వెలుగు: భైంసా సుభధ్రవాటిక సరస్వతీ శిశుమందిర్​లోఈ నెల 31న కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు  భారత్​దర్శన్​చైర్మన్​ డాక్టర్​ కిరణ్, జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సుదర్శన్​తెలిపారు. గురువారం స్థానికంగా పోస్టర్​రిలీజ్​చేసి వారు మాట్లాడారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని 31న సాయంత్రం 4.30 గంటలకు జరిగే దీపోత్సవ కార్యక్రమానికి భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి హాజరవుతారన్నారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో శిశు మందిర్​ కమిటీ సభ్యులు రమేశ్​మాశెట్టివార్, రామకృష్ణగౌడ్, గంగాధర్​గౌడ్, నూకల సురేశ్, పెండప్ కాశీనాథ్, డాక్టర్ నగేశ్, తూము దత్తు, కొట్టె హన్మాండ్లు, దేవేందర్,​ పోతన్న పాల్గొన్నారు.

గుడిరేవులో దండారీ ఉత్సవాలు

దండేపల్లి, వెలుగు: మండలం గుడిరేవు గోదావరి ఒడ్డున గల పద్మల్ పూరీ కాకో ఆలయంలో దండారీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీ గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ముందుగా గుస్సాడి వేషధారణలతో డప్పుచప్పుళ్ల నృత్యాల మధ్య గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి కాకో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. మహిళలు పిండి పదార్థాలు వండి కాకో అమ్మవారికి నైవేధ్యంగా సమర్పించారు. కాగా, ఈనెల 23 గుస్సాడీ దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కుడిమేత సోము, గోండ్వానారాయి సెంటర్ మండల అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య అతిథిగా ఉట్నూర్ ఐటీడీఏ పీవో వరున్​రెడ్డి హాజరవుతారని తెలిపారు.

సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ ప్రారంభం

నస్పూర్, వెలుగు: సింగరేణి సేవా సమితి శ్రీరాంపూర్ ఏరియా వారి ఆధ్వర్యంలో టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కోర్సులను శ్రీరాంపూర్ ఏరియా జీఎం  బి.  సంజీవరెడ్డి  సేవా సమితి అధ్యక్షురాలు రాధా కుమారి ప్రారభించారు. గురువారం సీసీసీ లోని సేవా కేంద్రంలో ప్రారంభించి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు శ్రీరాంపూర్ ఏరియాలో దాదాపు రెండు దశాబ్దాలుగా ఉచిత వృత్తి శిక్షణ కోర్సులను నిర్వహింస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక స్వలంబనకు వృత్తి శిక్షణ కోర్సులను ఉచితంగా సింగరేణి సేవా సమితి ద్వారా నేర్పించడం జరుగుతుందని, వృత్తి శిక్షణ కోర్సులను నేర్చుకోవడానికి వచ్చిన మహిళలందరూ ప్రతిరోజు శిక్షణ తరగతులకు హాజరవుతూ కోర్సులను పూర్తి చేసి సొంతగా ఉపాధిని కల్పించుకోవడంలో ముందుండాలని కోరారు.  ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ లీడర్ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, డిజిఎం పి.  గోవిందరాజు, సీనియర్ పిఓ కాంతారావు, సేవ సెక్రటరీ  జ్యోతి, ఫ్యాకల్టీలు రజిత,  తిరుమల, జ్యోతి, శైలజ, శారద, భవాని, హేమలత, రమ, సేవ సభ్యురాళ్లు  సునీత,  లక్ష్మి,  మంగ,  శిరీష, ప్రమీల పాల్గొన్నారు.

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

ఆదిలాబాద్​టౌన్/ఆసిఫాబాద్/జైపూర్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఆదిలాబాద్​ జిల్లా పోలీసు కార్యాలయంలో అమరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ ఉదయ్​కుమార్​రెడ్డి మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అడిషనల్​ఎస్పీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్​మహమ్మద్ యూనస్ అలీ, సీసీ దుర్గం శ్రీనివాస్, సెక్షన్ పర్యవేక్షణ అధికారి కుమార్ నాయక్, అడిషనల్​ఎస్పీ సీసీ గిన్నెల సత్యనారాయణ, ఆఫీసర్లు జె.భారతి, జె కవిత తదితరులు ఉన్నారు. ఆసిఫాబాద్​జిల్లా వాంకిడి పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ సురేశ్​ కుమార్​ హాజరయ్యారు. సీఐ శ్రీనివాస్ , ఎస్సైలు దీకొండ రమేశ్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్​లో  ఎస్సై రామ కృష్ణ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు.

రూ.1.11 కోట్ల చెక్కులు పంపిణీ

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​లబ్ధిదారులకు మున్సిపల్​చైర్మన్​రూ. 1.11 కోట్ల చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని టీఆర్ఎస్​ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. బీజేపీ లీడర్లు సంక్షేమ పథకాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్ఎస్​కు అండగా నిలుస్తారన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జహీర్​రంజాని, ఆర్డీవో రమేశ్ రాథోడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్లు సంద నర్సింగ్, పవన్ నాయక్, ఆవుల వెంకన్న, పందిరి భూమన్న, కో ఆప్షన్ సభ్యులు సంజయ్ పాల్గొన్నారు.

పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలి

మంచిర్యాల, వెలుగు: ఎన్​హెచ్​ 363 నిర్మాణంలో భాగంగా ఇండ్లు, భూములు కోల్పోతున్న మరో 30 కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు పనులు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్ నాయక్​కు బాధిత కుటుంబాలతో కలిసి మెమోరాండం అందజేశారు. సర్వే చేసిన దానికంటే ఎక్కువ ఆస్తి నష్టపోతున్న బాధితులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి త్వరగా పరిహారం అందించాలని కోరారు. నాయకులు సత్రం రమేష్, మిట్టపల్లి మొగిలి పాల్గొన్నారు. 

పోలీస్​ స్టేషన్లలో పచ్చదనం పెంచాలి

కుభీర్,వెలుగు: భైంసా డివిజన్​లో ప్రతీ పోలీస్​స్టేషన్​లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని ఏఎస్పీ కిరణ్​ఖారే కోరారు. గురువారం కుభీర్​స్టేషన్​లో గ్రీన్  ఇండియా చాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. అంతకుముందు ఆయన రికార్డులను పరిశీలించారు. కేసుల పురోగతి తెలుసుకున్నారు. నాటిన మొక్కలు సంరక్షించాలన్నారు. స్టేషన్​కు వచ్చే ప్రతీ ఒక్కరితో మర్యాద పూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో రూరల్​ సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు ఎండీ షరీఫ్​, శ్రీకాంత్, స్రవంతి సిబ్బంది పాల్గొన్నారు.