ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: చిన్నారులతో పాటు తల్లిదండ్రులు సైతం స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గిస్తే ఫలితాలు ఉంటాయని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. మొబైల్ వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ పట్టణంలోని ఓక్లే ఇంటర్నేషనల్, మాస్టర్‌మైండ్ పాఠశాలల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 2కె రన్‌ను ఎస్పీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ చౌక్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు రన్ నిర్వహించారు. స్మార్ట్ ఫోన్లను అధికంగా వాడడంతోనే అనర్థాలు జరుగుతాయన్నారు. ఫోన్ల వాడకాన్ని తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ సాయిని రవి, ప్రిన్సిపల్ బిన్నికౌర్ అహ్లువాలియా, పూనమ్ రతన్, ప్రణవ్, స్వప్న, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.