హ్యాండ్​బాల్​ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్​ గెలుపు

హ్యాండ్​బాల్​ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్​ గెలుపు

మంచిర్యాల, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో జరిగిన 46వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ చాంపియన్​షిప్​లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా జట్టు గెలిచింది. సెమీఫైనల్​లో రంగారెడ్డిపై 17-–05 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఈ తర్వాత ఫైనల్ లో మహబూబ్​నగర్ జిల్లాతో హోరాహోరీగా పోరాడి 

21-–14 గోల్స్ తేడాతో చాంపియన్​షిప్​ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉమ్మడి అదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యామ్ సుందర్ రావు, కార్యదర్శి కనపర్తి రమేశ్, కోశాధికారి రమేశ్​రెడ్డి అభినందించారు. 

కార్మెల్​ స్టూడెంట్​కు గోల్డ్​ మెడల్

మంచిర్యాలలో జరిగిన 10వ రాష్ట్రస్థాయి జూనియర్​ అథ్లెటిక్స్​ చాంపియన్​షిప్​లో కార్మెల్ కాన్వెంట్ ​హైస్కూల్​8వ తరగతి​ స్టూడెంట్​జ్యోతిర్మయి లాంగ్ ​జంప్​లో గోల్డ్​ మెడల్ ​సాధించింది. 300 మీటర్స్​ రన్నింగ్​లో అదే స్కూల్​కు చెందిన కేతన్​కు సిల్వర్ మెడల్​దక్కింది. స్టూడెంట్లను ప్రిన్సిపాల్​ సిస్టర్​ రిన్సీ, వైస్​ప్రిన్సిపాల్ ​సిస్టర్ ​టిస్సీ, పీఈటీలు అభినందించారు.