ట్యాక్స్ చెల్లించని వారికి నోటీసులు : టీటీసీ రవీందర్‌ కుమార్‌

ట్యాక్స్ చెల్లించని వారికి నోటీసులు : టీటీసీ రవీందర్‌ కుమార్‌

ఆదిలాబాద్‌, వెలుగు: ట్యాక్స్‌ చెల్లించని వాహనదారులకు నోటీసులు జారీ చేస్తామని డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్‌ కమిషన్‌(డీటీసీ) రవీందర్‌ కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024 సంవత్సరానికి సంబంధించి 90 శాతం ట్యాక్సులు వసూలు చేసినట్లు తెలిపారు. 15 సంవత్సరాలు దాటిన ప్రైవేట్‌ బస్సులను రోడ్డుపై తిప్పొద్దన్నారు. ప్రతి బస్సు కండీషన్, ఫిట్‌నెస్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

తిప్పకుండా ఉంచే వాహనాలకు సంబంధించిన వివరాలను ఆర్టీవో కార్యాలయంలో సమర్పించా లని, అలాంటి వాహనాలకు ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలి ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్‌ వాహనాలపై చర్యలు తీసుకోవాలన్నారు. గుడిహత్నూర్‌ సమీపంలో ఏటీఎస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా రవాణ శాఖ అధికారి సీపెల్లి శ్రీనివాస్, భోరజ్‌ చెక్‌పోస్టు ఇన్‌చార్జి అల్లి శ్రీనివాస్, ఎంవీఐ ప్రదీప్‌ కుమార్, ఏఎంవీఐలు రవిందర్, హరింద్ర కుమార్, అపర్ణ, మోహన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.