సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత..

పీఎం పసల్  బీమా యోజన  ప్రీమియం చెల్లించాలంటూ ఆదిలాబాద్ జిల్లా  రైతులు సీఎం క్యాంఫ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు.  ఆదిలాబాద్  బీజేపీ జిల్లా  అధ్యక్షుడు పాయల్ శంకర్  ఆధ్వర్యంలో  రైతులు ఆందోళనకు  దిగారు.  రాష్ట్ర  ప్రభుత్వం రెండు ఏళ్లుగా పీఎం పసల్ బీమా యోజన  ప్రీమియం  కట్టడం లేదని మండిపడ్డారు.  ప్రీమియం  కట్టకపోవడంతో  రైతులు ఇన్సురెన్స్ నష్టపోతున్నారని  ఆరోపిస్తున్నారు. దీంతో  రైతులను అడ్డుకున్నారు  పోలీసులు. వారిని అదుపులోకి  తీసుకొని  స్టేషన్ కు  తరలించారు. సర్కార్ కు  వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. ప్రీమియం  కట్టమని అడిగితే… అరెస్టులు  చేస్తారా  అంటూ  మండిపడుతున్నారు.