ఆదిలాబాద్లో మొదటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు

రాష్ట్రంలో మొట్టమొదటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయింది. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిత్వం ఖరారు కాకముందే ఓటర్లకు తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అయిన కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఆదిలాబాద్ లో కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై 171e , 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

రేపు(అక్టోబర్ 08) విచారణకు రావాలని ఆదేశించారు. కుక్కర్ల పంపిణీపై ఆదిలాబాద్ లో వ్యక్తి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో నోటీసులు జారీ చేసిన వన్ టౌన్ పోలీసులు.. రేపు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఆదిలాబాద్‌ పట్టణంలోని న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని టీటీడీ కల్యాణ మండపం దగ్గర శుక్రవారం(అక్టోబర్ 06) స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు, కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కంది శ్రీనివాస్‌రెడ్డి కుక్కర్ల పంపిణీ చేశారు. పంపిణీ కోసం రెడీ చేసిన కుక్కర్లను సీజ్ చేశారు.