చెన్నూరులో రెండు తలల పామును తరలిస్తున్న ముఠా అరెస్టు

చెన్నూరులో  రెండు తలల పామును తరలిస్తున్న ముఠా అరెస్టు
  • ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు

చెన్నూరు, వెలుగు: రెండు తలల పామును తరలిస్తున్న ముఠాను ఆదిలాబాద్ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఫారెస్ట్ ఆఫీసులో రేంజ్ ఆఫీసర్ శివకుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి చెన్నూరు మీదుగా రెండు తలల పామును కొందరు వ్యక్తులు తరలిస్తున్నారనే ముందుస్తు సమాచారం అందింది. ఈనెల 6న తెల్లవారు జామున చెన్నూరు మండలం చింతలపల్లిలో అనుమానా స్పదంగా కారు, బైక్ వెళ్తుండగా  ఆపి తనిఖీ చేశారు. 

కారులో రెండు తలల పాములు లభించింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. కోటపల్లి మండలం సర్వాయిపేటకు చెందిన కదార్ల ధనుంజయ్, కొల్లూరుకు చెందిన కొరళ్ల సంతోష్, బోరంపల్లికి చెందిన దుర్గం రాజగోపాల్, చెన్నూరుకు చెందిన వేమలు తిరుపతి, శ్రీరాంపూర్ కుచెందిన కుంభం పోచిరెడ్డి. మహారాష్ట్రలోని కొప్పులకు చెందిన సుదర్శన్, ప్రభాకర్ ముఠాగా ఏర్పడ్డారు. వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసి రెండు తలల పామును పట్టుకుని తరలిస్తున్నారు. 

నిందితులపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ –1972 యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచగా 14 రోజులు జైలుశిక్ష విధించింది. అడవిలో జంతువులను బంధించి అమ్మితే కేసులు నమోదు చేస్తామని చెన్నూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివకుమార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ రేంజర్ పోలాజి ప్రభాకర్, ఎఫ్ఎస్ఓ చంద్రమోహన్, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.