బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈడీ చర్యలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బ్యాంకులను మోసం చేసిన కేసు విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) చర్యలు ప్రారంభించింది. జిఎస్ ఆయిల్ మిల్ బ్యాంకులను మోసం చేసినట్లు నిర్ధారించుకుని రూ.360కోట్ల ఆస్తులు జప్తు చేసింది. ఆయిల్ మిల్ కు చెందిన 2వేల 50 ఎకరాల భూములను ఆటాచ్ చేసింది. దాదాపు 8 ఏళ్ల కిందట బ్యాంకులకు జీఎస్ ఆయిల్ మిల్ యాజమాన్యం కోట్లాది రూపాయలు ఎగ్గొట్టినట్టు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి విచారణలో ఉన్న ఈ కేసులో అభియోగాలను నిర్ధారించుకున్న ఈడీ చర్యలకు శ్రీకారం చుట్టింది. 

 

ఇవి కూడా చదవండి

నిర్మల్ జిల్లాలో పత్తి ధర ఆల్ టైం రికార్డ్

ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

ఉక్రెయిన్ - రష్యా మధ్య ఫలించిన చర్చలు.. వెనక్కి తగ్గిన రష్యా

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్