నేషనల్ పోటీల్లో ఆదిలాబాద్ గోల్డ్ మెడల్

నేషనల్ పోటీల్లో ఆదిలాబాద్  గోల్డ్ మెడల్

నేరడిగొండ వెలుగు: నేషనల్ లెవెల్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ తెలిపారు. బీహార్ లోని పాట్నాలో జరిగిన 41వ నేషనల్ లెవెల్ జూనియర్ సాఫ్ట్ బాల్ జరిగాయి. ఫైనల్లో తెలంగాణ టీమ్కేరళ జట్టుపై విజయం సాధించిదన్నారు. 

తెలంగాణ టీమ్ లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అఖిల్, నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన శిరీష, అలేఖ్య, వనిత ఉన్నారన్నారు. జాతీ యస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా ప్రెసిడెంట్ జాదవ్ అనిల్, జిల్లా ఎస్ఐ ఎస్ కోచ్ అఖిల, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.