పార్టీ మారే ఆలోచన మానుకున్న బాబురావు

  • త్వరలోనే కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీకి 

హైదరాబాద్​: ఆదిలాబాద్​ ఎంపీ, బీజేపీ లీడర్​సోయం బాబురావుకు జాతీయ స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ ను బీజేపీ హైకమాండ్​ఆఫర్ చేసినట్లు తెలిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీటును బాబురావుకు  కాకుండ బీఆర్​ఎస్​ నుంచి బీజేపీలో చేరిన నగేశ్ కు కాషాయ పార్టీ ఆదిలాబాద్​ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ​సోయం  తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీ నుంచి కాంగ్రస్​లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో  కాంగ్రెస్ లోకి వెళ్లకుండా  ఎంపీ సోయంను బీజేపీ పెద్దలు బుజ్జగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నామినేటెడ్ పోస్ట్ ను ఆఫర్​ చేశారు. త్వరలోనే కిషన్ రెడ్డి తో కలిసి ఢిల్లీకి   బాబు రావు వెళ్లనున్నారు. బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ ,  నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్​ సంతోష్ లను సోయం బాబు రావుకు కల్పిస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.  ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేశ్ కు సహకరించాలని బీజేపీ పెద్దలు సూచించారు. దీంతో పార్టీ మారే ఆలోచనను సోయం విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ :- అక్రమ లిక్కర్​ షాపులపై పోలీసులు దాడి.. 796 లీటర్ల మద్యం స్వాధీనం