- ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్
ముథోల్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ముథోల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి వాస్తాపూర్ వరకు సీఆర్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దశల వారీగా రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాన మంత్రి సడక్ యోజన, సీఆర్ఎఫ్ నిధులతో 14 గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. బీజేపీ లీడర్లు రాజేశ్ బాబు, నర్సాగౌడ్, సౌంవ్లీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.