కాగజ్ నగర్/దహెగాం, వెలుగు: చేనేతతో పాటు చేతివృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ అన్నారు. సోమవారం కాగజ్ నగర్లో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి పాల్గొన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు. నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా అందేలా చొరవ తీసుకుంటామన్నారు. ఇటీవల టీచర్ ఉద్యోగాలు సాధించిన 16 మంది పద్మశాలీలను సన్మానించారు.
ప్రెస్ క్లబ్లో లైబ్రరీ ఏర్పాటు హర్షనీయం
దహెగాం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం హర్షనీయమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దహెగాం మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్, గ్రంథాలయ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ లో లైబ్రరీ ఏర్పాటు చేయడం పట్ల సభ్యులను అభినందించారు. రిపోర్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థుల మనో ధైర్య ట్రస్ట్‌కు రూ.50 వేలు డొనేషన్ అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కుడిక్యాల రాజమౌళి, జిల్లా అధ్యక్షుడు సామల రాజన్న, అధికారులు, నాయకులు, రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.