
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుకు అస్వస్థతకు గురయ్యారు. చాతిలో నొప్పి, బీపీ పెరగడంతో ఆయనను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా సోయం బాపురావు అనారోగ్యానికి గల కారణాలు తెలియరాలేదు.