రాష్ట్రంలో ICMR నిబంధనలు పాటించడం లేదు

రాష్ట్రంలో ICMR నిబంధనలు పాటించడం లేదు

ఆదిలాబాద్ : రాష్ట్రంలో ICMR నిబంధనలు పాటించడకుండా క‌రోనా ప‌రీక్ష‌లు, చికిత్స చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్ ది చేతగాని ప్రభుత్వ‌మ‌న్నారు. కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేరుస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్ర‌శ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ రాష్ట్రంలో అమలు చేయడం లేదని.. కేంద్రం కరోనా కోసం రాష్ట్రానికి కేటాయించిన రూ. 8500 కోట్లకి లెక్కలు చెప్పాలన్నారు.

ఆదిలాబాద్ నగరంలోని రిమ్స్ ఆస్పత్రి అస్థవ్యస్థనంగా మారిందని.. డాక్టర్ల రిక్రూట్మెంట్ జ‌ర‌గడం లేదన్నారు. దీని కార‌ణంగా పేషంట్లను చూసేవారు క‌రువ‌య్యార‌న్నారు. ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీని కావాల‌నే కొంత‌మంది కోసం స్థానిక అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. రిమ్స్ సిబ్బంది అందరికీ సరిపడే PPE కిట్లు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని ఎంపీ అన్నారు.