ఆదిలాబాద్ ఎంపీ టికెట్.. జాదవ్ శ్రావణ నాయక్కు ఇవ్వాలి

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున  ఆదిలాబాద్ నుంచి ఎంపీ టికెట్ NSU సీనియర్  నేత,  జాతీయ నాయకుడు జాదవ్ శ్రావణ నాయక్ కు ఇవ్వాలని  మారుమూల గ్రామాలైన, తిప్ప(k), తిప్ప(G) , బోరింగ్ గూడ, రాజుల గూడ, హత్తి గుట్ట, అల్లి కోరి, నిషాన్ గాట్ గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా కోరారు.  శ్రావణ నాయక్ కు ఎంపీ టికెట్ ఖరారు చేస్తే..  ఆయనకు ఓటు వేసి గెలిపించుకుంటామని చెప్పారు.  ఆయ గ్రామాల సర్పంచ్ లు ముక్తకంఠంతో చెప్పుతూ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.